---Advertisement---

తిరువూరు సీటుపై జనసేనకు షాక్‌.. తిరుగుబాటు బాటలో టీడీపీ ఎమ్మెల్యే?

October 17, 2026

Summarize with AI

---Advertisement---

కూటమిలో సీట్ల కేటాయింపు (Seat Allocation) వ్యవహారం జనసేనలో(Jana Sena Party) అసంతృప్తిని మరింత పెంచుతోంది. పొత్తులో భాగంగా తిరువూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేనకు చెందిన పసుపులేటి మాధవికి (Pasupuleti Madhavi) సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తన వర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు పెనుబల్లి శ్రావణిని(Penuballi Sravani) చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

రేపు పెనుబల్లి శ్రావణి నామినేషన్‌ ర్యాలీకి (Rally) అందరూ హాజరుకావాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. కూటమి పొత్తులో జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థిని ప్రోత్సహిస్తున్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే పుత్తూరు, తుని, దర్శి, సాలూరు వంటి ప్రాంతాల్లో టీడీపీ(TDP) నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా తిరువూరు కూడా ఈ జాబితాలో చేరిందనే చర్చ ఆ పార్టీలో మరింత ఆందోళనకు కారణమవుతోంది. రాజాంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పేరుకు 21 మున్సిపాలిటీలు(Municipalities), నగర పంచాయతీల్లో(Nagar Panchayats) జనసేనకు ప్రాతినిధ్యం లభించినప్పటికీ, వాటిలోనూ పలు స్థానాల్లో టీడీపీ నాయకులకే అవకాశం దక్కుతోందనే భావన పార్టీ స్థానిక ఆశావహుల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించకపోవడం కూడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందనే చర్చ సాగుతోంది. తిరువూరు పరిణామాలు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో నెలకొన్న విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment