---Advertisement---

నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

October 18, 2026

Summarize with AI

---Advertisement---

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’(The Paradise) ఓటీటీలోకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన చిత్రం కావడంతో ‘ది ప్యారడైజ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక జాతి మనుగడ, గుర్తింపు కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నానికి జోడీగా కాయదు లోహర్ (Kayadu Lohar) నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. తాజాగా, అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘జడల్ జమానాకు స్వాగతం’ (Welcome to Jadal Zamana) అనే క్యాప్షన్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు.

‘ది ప్యారడైజ్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన నాని అభిమానులు డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment