ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నామినేషన్ల ప్రక్రియలో(Nomination Process) వైఎస్సార్సీపీ(YSRCP) అభ్యర్థులను అడ్డుకుంటున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు(Governor Abdul Nazeer) ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గత మూడు రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు (Nominations) వేయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి (State Election Commission – SEC) ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు (Democratic Conditions) ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకే ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Nara Chandrababu Naidu) ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎనిమిది మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాలేదని, మరో ఎనిమిది చోట్ల దాఖలు చేసిన నామినేషన్లను చించివేశారని ఆరోపించారు. నామినేషన్ల దశలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, అసలు పోలింగ్ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కడప జిల్లాలోని (Kadapa District) పులివెందుల(Pulivendula), ప్రొద్దుటూరు(Proddatur), కడప(Kadapa) సహా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు ఎదురయ్యాయని జగన్ ఆరోపించారు. పులివెందులలో 16 వార్డులు, ప్రొద్దుటూరులో 19 వార్డులు, కడపలో 54 వార్డులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో ఆటంకాలు సృష్టించారని తెలిపారు. యర్రగుంట్ల, కమలాపురం, రాయచోటిలో చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
రాజంపేట, బద్వేలులో చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వార్డు స్థానాలకు నామినేషన్లు పడలేదని పేర్కొన్నారు. దర్శిలో చైర్మన్ స్థానంతో పాటు 25 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాలుగు వార్డుల నామినేషన్ల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. కడప జిల్లాలో దాడులు, కత్తిపోట్ల ఘటనల్లో వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు గాయపడ్డారని, పులివెందులలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయని వెల్లడించారు.
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.






