---Advertisement---

కుప్పంలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి, చైర్మన్ అభ్యర్థి విజయ్ కుమార్ కిడ్నాప్ చేశారంటూ భార్య ఆవేదన!

October 19, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్యాలెస్ రోడ్డులో ఉన్న భరత్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టినట్లు సమాచారం.

మరోవైపు, డీకేపల్లి నివాసం నుంచి వస్తున్న కుప్పం చైర్మన్ అభ్యర్థి విజయ్ కుమార్‌ను కారులో కిడ్నాప్ చేశారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తన భర్త, స్క్రూటినీ ప్రక్రియ కోసం వెళ్తుండగా టీడీపీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆయన భార్య పావని ఆరోపించారు. తన భర్తకు ఏదైనా హాని జరిగితే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త విజయ్ కుమార్ ప్రాణాలకు ముప్పు ఉందని పావని ఆందోళన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment