కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’పై (Om) అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela), సాయి పల్లవి(Sai Pallavi) కథానాయికలుగా నటిస్తుండగా, మమ్ముట్టి(Mammootty) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన రెండో పాట ‘వీరవీర’తో(Veeraveera) పాటు ధనుష్ మాస్ లుక్కు సంబంధించిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘వీరవీర’ పాట పోస్టర్లో ధనుష్ ఒక చేతిలో తుపాకీ(Gun), మరో చేతిలో గొడ్డలితో(Axe) కనిపిస్తున్నారు. ఆయన లుక్‌లోని తీవ్రత, యాక్షన్ ఛాయలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ పాటకు సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) సంగీతం అందించారు. మాస్ బీట్తో రూపొందిన ‘వీరవీర’ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
వండర్ బార్ ఫిల్మ్స్(Wunderbar Films) బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు శ్రీలీల, సాయి పల్లవి, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కథ, నటన, సంగీతంతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.







