భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీలో(Men’s Selection Committee) కీలక మార్పులు చేపట్టినట్లు సమాచారం. మాజీ భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను(Pragyan Ojha) కొత్త చీఫ్ సెలెక్టర్‌గా (New Chief Selector) నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలం అక్టోబర్ 4తో ముగియడంతో ఆయన స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మాజీ స్పిన్నర్ రమేష్ పవార్‌కు (Ramesh Powar) కూడా సెలక్షన్ కమిటీలో చోటు కల్పించినట్లు సమాచారం.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా(Ashok Malhotra), జతిన్ పరాంజపే(Jatin Paranjpe) అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం రమేష్ పవార్ పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం.
భారత్(India) తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన పవార్.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా సేవలందించారు. భారత మహిళల జట్టుతో పాటు ముంబై, గుజరాత్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (BCCI Centre of Excellence) బౌలింగ్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.
2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ కాలంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు సాధించినట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
🚨 Announcement 🚨 Mr Ramesh Powar @imrameshpowar appointed to Men’s Selection Committee. Based on seniority (most Tests), Mr Pragyan Ojha @pragyanojha will chair the Committee. BCCI appreciates Mr Ajit Agarkar @imAagarkar for his commitment, conviction and contribution during his tenure as Chairman of the Committee. Details ▶️ https://t.co/z0jcyPWkr0 #TeamIndia
— BCCI (@BCCI) October 19, 2026
సీనియారిటీ ఆధారంగా ప్రజ్ఞాన్ ఓజా కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. కొత్త కమిటీలో శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ సభ్యులుగా ఉండనున్నారు.
కొత్త సెలక్షన్ కమిటీ నియామకాలపై అధికారిక ధృవీకరణతో పాటు, రాబోయే సిరీస్‌ల కోసం జట్టు ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.







