---Advertisement---

జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహత్య హెచ్చరిక.. ఎమ్మెల్యేపై హర్ష వీణ సంచలన ఆరోపణలు

March 27, 2026

---Advertisement---

ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Arava Sridhar) పై బాధితురాలు హర్ష వీణ(Harsha Veena) చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో తనకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

న్యాయం లేకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానన్న బాధితురాలు

తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ(Janasena Party) కార్యాలయం ఎదుట పెట్రోల్ (Petrol) పోసుకుని ఆత్మహత్య(Suicide)చేసుకుంటానని హర్ష వీణ హెచ్చరించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలిగా తాను బయట తిరగలేని పరిస్థితిలో ఉన్నానని, కానీ ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి ఆరోపణలు లేనట్టుగా ప్రజల్లో తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. తనకు జరిగిన అన్యాయంపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని హర్ష వీణ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment