---Advertisement---

కల్లబొల్లి మాటల కట్టిపెట్టండి మీరు చేసిన మంచి ఏమిటో చెప్పండి – చిన్న శ్రీను సూటి ప్రశ్నలు

April 1, 2026

---Advertisement---

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు కళా వెంకట్రావును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించారు. తాము చేతల ప్రభుత్వమని, ప్రత్యర్థులు కేవలం ప్రచారంతోనే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ సెంటర్, మూలపేట పోర్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించిన ఘనతగా పేర్కొన్నారు.

ఇకపోతే, కళా వెంకట్రావు ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసినా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలకు పోవడం కంటే, ప్రజలకు చేసిన సేవలను వెల్లడించాలని సూచించారు.

అమరావతి విషయంలో తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ అక్కడ జరిగిన అవినీతి, అక్రమాలను మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ఖర్చులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పారదర్శకత కోరారు. రైతుల సమస్యలు, మద్దతు ధరలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన నాయకత్వమని పేర్కొంటూ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment