---Advertisement---

David Miller: మ్యాచ్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ ఎమోషన్.. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు

April 9, 2026

---Advertisement---

ఒక చిన్న నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ఎలా మార్చేస్తుందో మరోసారి క్రికెట్ ప్రపంచం చూసింది. స్టార్ బ్యాట్స్‌మన్ మిల్లర్ (David Miller) చేసిన చిన్న తప్పు ఢిల్లీ జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కేవలం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

చివరి క్షణాల్లో మలుపు తిరిగిన మ్యాచ్

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium)లో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు థ్రిల్లర్‌గా సాగింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు చివరి రెండు ఓవర్లలో గెలుపు దిశగా సాగింది. గాయంతో బయటకు వెళ్లి తిరిగి క్రీజులోకి వచ్చిన మిల్లర్ అద్భుతంగా ఆడి జట్టుకు ఆశలు కలిగించాడు.

19వ ఓవర్లో Mohammed Siraj బౌలింగ్‌లో మిల్లర్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) బౌలింగ్‌కు వచ్చాడు.

చివరి మూడు బంతుల్లో 8 పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితం చేశాడు. అయితే కీలక సమయంలో సింగిల్ తీసే అవకాశాన్ని వదిలేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. చివరి బంతిలో రెండు పరుగులు అవసరమైనప్పుడు మిల్లర్ షాట్ మిస్ చేయడంతో వికెట్ కీపర్ Jos Buttler చురుకుగా వ్యవహరించి రనౌట్ చేశాడు.

దీంతో ఢిల్లీ జట్టు 209 పరుగుల వద్దే ఆగిపోయి రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కనిపించగా, కోచ్ హేమంగ్ బదానీ అతడిని ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment