---Advertisement---

స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాపై వైఎస్సార్‌సీపీ కీలక డిమాండ్.. ఈసీకి లేఖ!

October 10, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2026 జూలై 15 వరకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో నమోదైన అర్హులందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

2026 ఫిబ్రవరి 5 నాటి పాత ఓటరు జాబితాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, ఆ తర్వాత జూలై 15 వరకు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వేలాది మంది అర్హులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జూలై 15 వరకు నమోదైన ఓటర్లను స్థానిక ఎన్నికల జాబితాలో చేర్చాలని, తాజా మార్పులతో కూడిన జాబితాను ముందుగానే ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకుని తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment