---Advertisement---

Modi – Meloni – Melody: ఇటలీ ప్రధాని మెలోనికి మోదీ ‘మెలోడీ చాక్లెట్’ గిఫ్ట్.. వీడియో వైరల్!

May 20, 2026

---Advertisement---

ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ(Narendra Modi) మరోసారి తన ప్రత్యేక శైలితో వార్తల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni)కి ఆయన ఇచ్చిన ఓ చిన్న బహుమతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెలోనికి మోడీ ప్రత్యేకంగా ‘మెలోడీ’ టాఫీల ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా అందించగా, ఆ క్షణాన్ని స్వయంగా మెలోని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. “బహుమతికి ధన్యవాదాలు” అంటూ మెలోని చేసిన పోస్ట్‌తో #Melodi హ్యాష్‌ట్యాగ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.

గత 2 సంవత్సరాలుగా మోడీ-మెలోని స్నేహబంధం అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా ప్రత్యేక చర్చగా మారింది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి #Melodi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, ఈసారి ‘మెలోడీ’ టాఫీ గిఫ్ట్‌ ఆ బంధానికి సరదా టచ్‌ను జోడించింది. “Melodi” అనే పదాన్ని “Melody” చాక్లెట్‌తో ముడిపెట్టి నెటిజన్లు భారీగా మీమ్స్‌, పోస్టులు చేస్తుండగా, సోషల్‌ మీడియా మొత్తం ఈ వీడియోతో హోరెత్తిపోతోంది.

ఇటలీ-భారత్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాల్లో మరింత బలపడుతున్నాయి. వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పర్యటనలో కూడా కీలక అంశాలపై మోడీ-మెలోని చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరి సెల్ఫీలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారగా, ఇప్పుడు ‘మెలోడీ టాఫీ’ గిఫ్ట్‌ ఘటన మరో కొత్త హాట్‌టాపిక్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో “మోడీ-మెలోని కెమిస్ట్రీకి ఇదే నిదర్శనం”, “మెలోడీతో మెలోడి మరింత స్ట్రాంగ్‌ అయింది” అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. చిన్న గిఫ్ట్‌ అయినా, దానికి వచ్చిన స్పందన మాత్రం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment