ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) మరోసారి తన ప్రత్యేక శైలితో వార్తల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni)కి ఆయన ఇచ్చిన ఓ చిన్న బహుమతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెలోనికి మోడీ ప్రత్యేకంగా ‘మెలోడీ’ టాఫీల ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా అందించగా, ఆ క్షణాన్ని స్వయంగా మెలోని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. “బహుమతికి ధన్యవాదాలు” అంటూ మెలోని చేసిన పోస్ట్‌తో #Melodi హ్యాష్‌ట్యాగ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గత 2 సంవత్సరాలుగా మోడీ-మెలోని స్నేహబంధం అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక చర్చగా మారింది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి #Melodi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, ఈసారి ‘మెలోడీ’ టాఫీ గిఫ్ట్ ఆ బంధానికి సరదా టచ్‌ను జోడించింది. “Melodi” అనే పదాన్ని “Melody” చాక్లెట్‌తో ముడిపెట్టి నెటిజన్లు భారీగా మీమ్స్, పోస్టులు చేస్తుండగా, సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోతో హోరెత్తిపోతోంది.
ఇటలీ-భారత్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాల్లో మరింత బలపడుతున్నాయి. వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పర్యటనలో కూడా కీలక అంశాలపై మోడీ-మెలోని చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరి సెల్ఫీలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారగా, ఇప్పుడు ‘మెలోడీ టాఫీ’ గిఫ్ట్ ఘటన మరో కొత్త హాట్‌టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో “మోడీ-మెలోని కెమిస్ట్రీకి ఇదే నిదర్శనం”, “మెలోడీతో మెలోడి మరింత స్ట్రాంగ్ అయింది” అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. చిన్న గిఫ్ట్ అయినా, దానికి వచ్చిన స్పందన మాత్రం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026






