అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ (FHFA) డైరెక్టర్గా, అలాగే ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ సంస్థల చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విలియం జె. పుల్టేను (William J. Pulte) తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్గా (Director of National Intelligence) నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ద్వారా వెల్లడించారు.
అమెరికాలో అత్యంత సున్నితమైన వ్యవహారాల నిర్వహణలో పుల్టేకు విశేష అనుభవం ఉందని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక మార్కెట్ల భద్రత, స్థిరత్వాన్ని కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఫ్యానీ మే(Fannie Mae), ఫ్రెడీ మాక్ (Freddie Mac) సంస్థల ఆధ్వర్యంలో 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తుల నిర్వహణను సమర్థంగా చేపట్టారని చెప్పారు. కేవలం 1 సంవత్సరం క్రితం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా పుల్టే FHFA డైరెక్టర్గా, అలాగే ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ చైర్మన్గా కొనసాగుతారని ట్రంప్ స్పష్టం చేశారు. “డైరెక్టర్ పుల్టేకు అభినందనలు” అంటూ తన సందేశాన్ని ముగించారు. ఈ నియామకం అమెరికా పరిపాలనలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్గా ఉన్న తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆమె స్పష్టం చేశారు. పూర్తిగా కుటుంబ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
తన భర్తకు అరుదైన వ్యాధి నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించడం అత్యంత ముఖ్యమైందని గబ్బార్డ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో భర్తకు అండగా నిలబడటమే తన ప్రాధాన్యత అని వెల్లడించారు.
On Truth Social, US President Donald Trump posts, "I am appointing the Director of the Federal Housing Finance Agency, and Chairman of Fannie Mae/Freddie Mac, William J. Pulte, to serve as Acting Director of National Intelligence. William has deep experience managing the most… pic.twitter.com/wMJAQnN1RD
— ANI (@ANI) June 2, 2026








