---Advertisement---

Donald Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’ అంటూ అమెరికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

June 3, 2026

Summarize with AI

---Advertisement---

అమెరికా అధ్యక్షుడు (American President) ట్రంప్ (Trump) మరోసారి భారత్‌పై(India), ప్రధాని మోడీపై (Modi) ప్రశంసలు కురిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఐ లవ్ ఇండియా(I Love India).. ఐ లవ్ మోడీ (I Love Modi)’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రూత్ సోషల్ (Truth Social) మీడియా వేదికగా ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్ ఇప్పుడు రెండు దేశాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవాన్ని (America Independence 250th Anniversary) పురస్కరించుకుని ‘‘ఫ్రీడమ్ ఎట్ 250’’(Freedom At 250) వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత్, అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio), భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో (Jaishankar) పాటు సుమారు 1,500 మంది అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వేడుకల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా అమెరికా రాయబారి సెర్గియా గోర్‌కు (Sergio Gor) ఫోన్ కాల్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం వేడుకలకు హాజరైన అతిథులతో మాట్లాడిన ట్రంప్ భారత్‌పై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. “నాకు భారత్ అంటే ఎంతో ఇష్టం. భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలపడాలి” అని ఆయన వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే ప్రధాని మోడీ నాయకత్వాన్ని కూడా ట్రంప్ ప్రశంసించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భారత్-అమెరికా (India-US) సంబంధాలు ప్రస్తుతం మరింత బలపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య, భద్రతా అంశాల్లో సహకారం పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

కొంతకాలంగా ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు కనిపించినప్పటికీ ప్రస్తుతం సంబంధాలు మళ్లీ గాడినపడినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుంకాలు, మార్కెట్ యాక్సెస్, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రెండు దేశాల అధికారులు చర్చలు జరుపుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment