రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి(Undavalli), పెనుమాక (Penumaka) గ్రామాల రైతులు (Farmers) సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) నిర్మాణం విషయంలో తమపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఆదివారం ఆందోళన చేపట్టారు. పట్టాదారు పాస్ పుస్తకాలను (Pattadar Passbooks) చేతబట్టి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన రైతులు తాము నిజమైన భూ యజమానులమేనని, దుండగులం కాదని స్పష్టం చేశారు. టీడీపీ (TDP) శ్రేణులు చేస్తున్నట్లు చెబుతున్న దుష్ప్రచారం తమను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని (Capital City) ప్రకటించకముందే ఉండవల్లి, పెనుమాక ప్రాంత భూములకు కోట్ల రూపాయల విలువ ఉండేదని, తుళ్లూరు (Thullur) ప్రాంతంతో తమ పరిస్థితిని పోల్చడం సరికాదన్నారు. తుళ్లూరులో పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతులు ఉండగా, తమ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు 10 నుంచి 25 సెంట్ల వరకు మాత్రమే భూములు కలిగి ఉన్నారని తెలిపారు. ఈ చిన్న చిన్న భూములే తమ కుటుంబాల జీవనాధారమని, వాటిని కోల్పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం ఇప్పటికే 99 శాతం మంది రైతులు కుల, మత భేదాలు లేకుండా భూములు(Lands) ఇచ్చారని, అయితే అత్యల్ప భూమి కలిగిన రైతులను భూ సమీకరణ(Land Pooling), భూ సేకరణ (Land Acquisition) ప్రక్రియల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. తమ న్యాయమైన డిమాండ్లను వక్రీకరించి ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసి తమ సమస్యలు వివరించిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు తమపై కక్షపూరిత ప్రచారం ప్రారంభించారని రైతులు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే కుట్రపూరితంగా ఈ ప్రచారం నడుస్తోందని, వందలాది యూట్యూబ్ ఛానళ్ల (YouTube Channels) ద్వారా వ్యక్తిగతంగా, కులాల (Castes) పేరుతో దూషణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను (Pawan Kalyan) కలిసి తమ సమస్యలు వివరించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా అవకాశం ఇవ్వలేదని రైతులు తెలిపారు. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి తమ గోడు వినిపిస్తున్నామని పేర్కొన్నారు.
ఉండవల్లి, పెనుమాక ప్రాంత భూములు అత్యంత సారవంతమైనవని, ఒకేసారి రెండు మూడు పంటలు పండే పరిస్థితి ఉందని రైతులు వివరించారు. ఈ భూములను కోల్పోతే తమ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా తమ మీకరణ లేదా భూ సేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.





