---Advertisement---

ఉంటాను డాడీ’ అన్న చివరి మాటలే మిగిలాయి.. కన్నీరు పెట్టించిన పైడిరాజు ఇక లేరు

June 10, 2026

---Advertisement---

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakha Steel Plant) జరిగిన విషాదకర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు (Worker) పైడిరాజు (Paidiraju) చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కు చేరింది. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో (Seven Hills Hospital)‌ ప్రాణాలతో పోరాడిన ఆయన చివరకు మృత్యువుకు లొంగిపోయారు.

ప్రమాదం అనంతరం కాలిన గాయాలతో ఆస్పత్రి నుంచి తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పైడిరాజు పంపిన భావోద్వేగ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. తన కుమారుడు వర్మతో మాట్లాడుతూ, “వర్మ(Varma).. తమ్ముడిని (Younger Brother) బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో.. అమ్మను(Mother) బాగా చూసుకోండి.. ఉంటాను డాడీ (Bye Daddy)” అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేశాయి.

కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై (Family Members Future) ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లల చదువు, తల్లిని చూసుకోవాలని సూచించిన పైడిరాజు చివరి సందేశం ఇప్పుడు మరింత విషాదాన్ని మిగిల్చింది. ప్రాణాలతో పోరాడుతూ కుటుంబం కోసం ధైర్యం చెప్పిన ఆయన, చివరకు చికిత్స ఫలించక మృతి చెందడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, సహచరులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ ఘటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మరోసారి భద్రతా ప్రమాణాలు, కార్మికుల రక్షణ చర్యలపై చర్చ మొదలైంది. పైడిరాజు చివరి మాటలు మాత్రం ఆయన కుటుంబానికే కాదు, ఈ విషాదాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment