---Advertisement---

వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. తొలి పాట ‘నారాయణమ్మ’ విడుదల!

September 27, 2026

Summarize with AI

---Advertisement---

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’(Adarsha Kutumbam). ‘హౌస్ నెంబర్ 47’(House Number 47) అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్ (Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను(Narayanamma) తాజాగా విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభ, రామ్ ఆలపించారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాటపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కుటుంబ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ‘నారాయణమ్మ’ పాట ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అక్టోబర్ 9న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment