---Advertisement---

అచ్చెన్నాయుడు మాటలతో పింఛన్‌దారుల్లో ఆందోళన.. కొత్త పింఛన్లపై ఆశలు ఆవిరేనా?

September 22, 2026

Summarize with AI

---Advertisement---

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లావేరు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయ (Mahatma Jyotiba Phule Girls Residential School) తాత్కాలిక భవనాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఎల్‌నినో (El Niño) తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్న ఆయన.. కొత్త పింఛన్ల (New Pensions) కోసం 16 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందరికీ ఒకేసారి పింఛన్లు ఇవ్వాలంటే ప్రభుత్వానికి నిధులు లేవని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నేపథ్యంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు మరింత పెరిగిన సమయంలో అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రెండేళ్లుగా కొత్త పింఛన్లు అందక పలువురు అర్హులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం (Government) కసరత్తు చేసినప్పటికీ, ప్రస్తుతం నిధుల కొరత ఉందన్న మంత్రి వ్యాఖ్యలు లబ్ధిదారుల్లో నిరాశకు దారితీశాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్త పింఛన్ల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అధికార టీడీపీకి(TDP) ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment