ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు గుర్తొచ్చే పేర్లలో ముందుంటుంది మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan). ప్రతి ఏడాది తన ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో రెడ్ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించే ఐశ్వర్య.. ఈసారి కూడా ఊహించని రేంజ్‌లో స్టన్నింగ్ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్(Amit Aggarwal) ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన గౌన్‌లో ఆమె కేన్స్ వేదికపై నిజంగానే క్వీన్‌లా మెరిశారు.
అమిత్ అగర్వాల్ కలెక్షన్‌లోని ‘లుమినారా’ (Luminara) పేరుతో రూపొందించిన డీప్ శాఫైర్ బ్లూ గౌన్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఈ డ్రెస్ వెనుక ఉన్న కష్టం, దాని టెక్నికల్ డిజైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం ‘క్రిస్టల్ వీన్’ ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉపయోగించి దాదాపు 1500 గంటల పాటు పూర్తిగా చేతిపనితో ఈ గౌన్‌ను డిజైన్ చేశారు. అంటే సుమారు 62 రోజుల పాటు ప్రత్యేక నైపుణ్యంతో ఈ అవుట్‌ఫిట్‌పై వర్క్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ గౌన్‌లో మరో పెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. కెమెరా ఫ్లాష్ లైట్ పడినప్పుడు డ్రెస్ లోపల ఏదో ద్రవం కదులుతున్నట్టుగా కనిపించే ప్రత్యేక ఆప్టికల్ ఇల్యూషన్ ఎఫెక్ట్. ఈ విజువల్ మ్యాజిక్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఉన్న వారిని మాత్రమే కాదు.. సోషల్ మీడియా యూజర్లను కూడా పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ శాఫైర్ బ్లూ గౌన్‌కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్య డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్ ధరించగా.. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో ఆమె లుక్ మరింత రాయల్‌గా కనిపించింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival)తో ఐశ్వర్యారాయ్‌కు దాదాపు రెండు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. ఇప్పటివరకు ఆమె రికార్డు స్థాయిలో 24 సార్లు కేన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. 2002లో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన ‘దేవదాస్'(Devdas) సినిమా ప్రీమియర్ సందర్భంగా తొలిసారి ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది తన గ్లామర్, గ్రేస్, స్టైల్‌తో అంతర్జాతీయ మీడియాను ఆకట్టుకుంటూనే ఉన్నారు.
ఇప్పటికీ అదే అందం, అదే ఎలిగెన్స్‌తో కేన్స్ వేదికను రూల్ చేస్తున్న ఐశ్వర్యను నెటిజన్లు మరోసారి “కేన్స్ క్వీన్”గా కొనియాడుతున్నారు. “ఐశ్వర్య ఎప్పుడూ కేన్స్ వేదికపై తనదైన స్టైల్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈసారి ఆమెను నిజమైన క్వీన్‌లా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ లుక్‌ను డిజైన్ చేశాం” అంటూ డిజైనర్ అమిత్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు.






