టీమిండియా (Team India) చీఫ్ సెలెక్టర్(Chief Selector) అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. అయితే చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగేందుకు అగార్కర్ ఆసక్తి చూపడం లేదని, ఈ విషయాన్ని బీసీసీఐలోని సీనియర్ అధికారులకు తెలియజేసినట్లు పీటీఐకి(PTI) సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసే అంశంపై బీసీసీఐ(BCCI) దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సెలక్షన్ కమిటీలకు(Selection Committees) సంబంధించిన భవిష్యత్ నిర్ణయాల బాధ్యతను బోర్డు అధికారులకు అప్పగించినట్లు సమాచారం. జూనియర్ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న 5 స్థానాల భర్తీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కార్యదర్శి దేవాజిత్ సైకియా(Devajit Saikia) తెలిపారు. ఎంపిక ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
భారత జట్టు ఫీల్డింగ్ కోచ్(Fielding Coach) సుభదీప్ ఘోష్(Subhadeep Ghosh) కొనసాగింపుపైనా సమీక్ష జరగనుంది. మరోవైపు రాంచీ నుంచి భారత్, ఆస్ట్రేలియా టెస్ట్‌ను తరలించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జార్ఖండ్ క్రికెట్ సంఘం (Jharkhand Cricket Association) స్పష్టం చేసింది. వాంఖడేలో టెస్ట్ నిర్వహించాలన్న ప్రతిపాదనను ముంబై క్రికెట్ సంఘం బీసీసీఐ ముందు ఉంచింది.
అంపైర్లు(Umpires), మ్యాచ్ రిఫరీల(Match Referees) చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేశారు. ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లకు రోజుకు రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల చొప్పున చెల్లించనున్నారు. అలాగే వయస్సు ధ్రువీకరణ విధానాన్ని నవీకరించడంతో పాటు, లైంగిక వేధింపుల నివారణ (Prevention of Sexual Harassment) కోసం కొత్త అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. అగార్కర్ స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







