---Advertisement---

వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యగారు..’లెనిన్‌’తో అఖిల్ కెరీర్ బెస్ట్ రికార్డు!

July 30, 2026

Summarize with AI

---Advertisement---

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక మాస్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆ ఎదురుచూపులకు లెనిన్ (Lenin) ఫుల్ స్టాప్ పెట్టేసింది. అఖిల్‌కు ఎలాగైనా సాలిడ్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయిన నాగార్జున (Nagarjuna) ప్లాన్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రేంజ్‌లో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

రిలీజ్ అయిన దగ్గర నుంచి లెనిన్‌కు (Lenin) మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అఖిల్ (Akhil) నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అందుకే రెండో, మూడో వారాల్లో కూడా సినిమా డీసెంట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించింది. పాజిటివ్ టాక్‌తో పాటు మౌత్ పబ్లిసిటీ కూడా సినిమాకు భారీగా ప్లస్ అయింది.

తాజాగా లెనిన్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల (100 Crores Gross Collections) మైలురాయిని అందుకుని అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే సమయంలో అఖిల్‌కు తొలి రూ.100 కోట్ల గ్రాసర్ చిత్రంగా కొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ టాక్, అఖిల్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ సక్సెస్‌కు ప్రధాన కారణాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

గతేడాది తండేల్ సినిమాతో అక్కినేని నాగ చైతన్య రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టగా, ఇప్పుడు లెనిన్‌తో అఖిల్ కూడా అదే ఫీట్ అందుకోవడంతో అక్కినేని అభిమానులు ఫుల్ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment