---Advertisement---

వైజాగ్‌లో ‘AAA సినిమాస్’ గ్రాండ్ లాంచ్– అల్లు అర్జున్ భావోద్వేగ క్షణాలు..!

August 9, 2026

Summarize with AI

---Advertisement---

విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సినీ ప్రియులకు ఊహించని వినోద కానుకను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్ కాంబినేషన్‌లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘ఏఏఏ సినిమాస్’(AAA Cinemas) మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. వైజాగ్(Vizag) ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుక అభిమానుల కోలాహలం, హర్షధ్వానాల మధ్య ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన బన్నీ తీవ్ర భావోద్వేగానికి (Emotional) గురయ్యారు. విశాఖపట్నం తనకు ఎంతో ఇష్టమైన నగరమని, తన సినీ ప్రస్థానంతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. తన తొలి చిత్రం ‘గంగోత్రి’ షూటింగ్ (Gangotri Shooting) సమయంలో విశాఖ వీధుల్లో నడిచిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

“వైజాగ్ నాకు ఎంతో ప్రత్యేకమైన ఊరు. నా తొలి సినిమా ‘గంగోత్రి’ షూటింగ్ సమయంలో ఈ వీధుల్లో నడిచినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టేవాళ్లు కూడా కాదు. కానీ ఈ రోజు ఇక్కడ అడుగుపెడితే అభిమానుల ఆప్యాయతతో నడవలేనంత ప్రేమ లభిస్తోంది. ఆ రోజుల్లోనే ఈ నగరంలో ఒక భారీ మాల్ వస్తుందని, అందులో నా సొంత ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ (Prestigious Multiplex) అందుబాటులోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇదొక కల నిజమైన క్షణం” అని అల్లు అర్జున్ అన్నారు.

మాల్స్ ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ అవి కేవలం వాణిజ్య సముదాయాలు మాత్రమే కాదని, నగర సంస్కృతిలో కూడా ఒక భాగమని బన్నీ అభిప్రాయపడ్డారు. చెన్నైలో తాను పెరిగిన రోజుల్లో మాల్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైజాగ్ ప్రజలకు, కుటుంబాలకు, యువతకు ఇన్ ఆర్బిట్ మాల్ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించాలని ఆకాంక్షించారు.

ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలను వివరిస్తూ భారతదేశంలో(India) ఎక్కడా లేని వినూత్న సాంకేతికతను వైజాగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని అల్లు అర్జున్ తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన తెరకు ‘వైల్డ్ ఫైర్’(Wildfire) అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్‌లోని ప్రతి తెరను ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా రూపొందించామని, ఇది వైజాగ్ ప్రజలకు తాము అందిస్తున్న ప్రత్యేకమైన అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అభిమానుల కేరింతలు, ఉత్సాహాన్ని చూసిన అల్లు అర్జున్ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. “కొంచెం రిలాక్స్ అవ్వండి డాడీ(Relax Daddy)” అంటూ అభిమానులను ఉద్దేశించి చమత్కరించడంతో కార్యక్రమం మరింత సందడిగా మారింది.

ఈ మల్టీప్లెక్స్ కేవలం సినిమాలు చూసే థియేటర్‌గా కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతులను అందించే వేదికగా నిలుస్తుందని బన్నీ విశ్వాసం వ్యక్తం చేశారు. వైజాగ్ నగరం అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తనపై నిరంతరం చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు (Love and Affection) విశాఖ ప్రజలందరికీ అల్లు అర్జున్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment