టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య ఉండే స్నేహం అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) మధ్య ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు ప్రేమగా ‘బావ’(Bava) అని పిలుచుకునే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరోసారి తమ స్నేహాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘డ్రాగన్’(Dragon) గ్లింప్స్ (Glimpse) ప్రస్తుతం యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. యాక్షన్, పవర్‌ఫుల్ లుక్స్‌తో వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో ‘ఈసారి టైగర్ (Tiger) కాదు.. డ్రాగన్’ అంటూ తారక్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘హ్యాపీ బర్త్‌డే బావ (Happy Birthday Bava).. ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో శ్రేయస్సు, శాంతి, ప్రేమను తీసుకురావాలి’ అంటూ హార్ట్‌ఫెల్ట్ మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను అభిమానులు భారీగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తారక్ కొత్త లుక్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు బన్నీ చేసిన ‘టైగర్ (Tiger) కాదు.. డ్రాగన్’ కామెంట్ ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ప్రత్యేక చర్చకు దారితీసింది.
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
— Allu Arjun (@alluarjun) May 20, 2026
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥






