---Advertisement---

అంబటి రాంబాబుకు బెయిల్‌ – విడుదలకు మార్గం సుగమం!

February 11, 2026

Summarize with AI

---Advertisement---

వైసీపీ (YSRCP) సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) ప్రైవేటీకరణకు (Privatization) వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా సీఐ విధులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో హాజరుపరిచారు.

కేసు విచారణ అనంతరం కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల అంబటి రాంబాబుపై నమోదైన 35 కేసుల్లోనూ అరెస్టు చేయరాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు భారీ ఉరటనే చెప్పాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment