రెండేళ్ల క్రితం వైసీపీ(YSRCP) అధికారాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ కార్యకర్తలు (Party Activists) ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. అధికారం లేని సమయంలోనే నిజమైన కార్యకర్తల ధైర్యం, పట్టుదల బయటపడుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుంటూరు వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు (Guntur Corporation Elections) కార్యకర్తలు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ధన బలం(Money Power), అధికార బలం (Political Power) ఎదురైనా భయపడకుండా పోరాడతామని స్పష్టం చేశారు.
గుంటూరు కార్పొరేషన్లోని 76 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులను బరిలో నిలిపి విజయం (Victory) సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని అంబటి రాంబాబు తెలిపారు. తమపై అక్రమ కేసులు పెట్టినా, దాడులకు పాల్పడినా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గబోవని అన్నారు.
గుంటూరులో మరోసారి వైఎస్సార్సీపీ జెండాను (YSRCP Flag) ఎగురవేస్తామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.





