---Advertisement---

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల ముప్పు!

September 6, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon), బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తర కోస్తాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాబోయే 3 గంటలకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏలూరు, నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక తెలంగాణలోనూ (Telangana) ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment