---Advertisement---

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఎఫెక్ట్.. 28 వరకు వర్షాలు.. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

August 21, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో(Telangana) వాతావరణం (Weather) మరోసారి మారనుంది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనం (Low Pressure Area) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

అల్పపీడనం(Low Pressure) ప్రభావంతో నేడు రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ(Andhra Pradesh) వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment