---Advertisement---

Anushka Shetty: సినిమాలకు దూరంగా అనుష్క శెట్టి.. ఇక గుడ్‌బై చెప్పనున్నారా?

September 6, 2026

Summarize with AI

---Advertisement---

అనుష్క శెట్టి(Anushka Shetty) సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానులు (Fans) స్వీటీని (Sweety) తెగ మిస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, ఆమె కొత్త సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా (Movie) చేయడానికి కూడా అనుష్క ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

అనుష్క నటించిన ఘాటీ (Ghaati) సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు ఆమె నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక సినిమా కథనార్(Kathanar). అయితే ఈ ప్రాజెక్ట్‌కు అనుష్క తాజాగా కమిట్ కాలేదు. దాదాపు 3 ఏళ్ల క్రితమే ఆమె ఈ సినిమాకు సైన్ చేశారు.

మలయాళ స్టార్ హీరో జయసూర్య (Jayasurya) ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కథనార్ సినిమాలో అనుష్క కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన అందుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి.

శ్రీ గోకులం సంస్థ (Sree Gokulam Production House) నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

మలయాళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. కథనార్‌ను దసరా సందర్భంగా లేదా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం కథనార్ మినహా అనుష్క చేతిలో మరో సినిమా లేదు. ఈ సినిమా తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కథనార్ వంటి భారీ పాన్ ఇండియా సినిమా ప్రచార కార్యక్రమాల్లో అనుష్క పాల్గొంటారా అన్నది కూడా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి స్వీటీ త్వరలోనే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారా అనేది చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment