---Advertisement---

కరువు కళ్లముందే కనిపిస్తున్నా.. మండలాల సంఖ్యను కుదించడమేంటి?

October 3, 2026

Summarize with AI

---Advertisement---

ఖరీఫ్‌ సీజన్‌పై (Kharif Season) ఎల్‌నినో(El Niño) ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కరువు (Drought) ఛాయలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 283 మండలాలను తీవ్ర కరువు, 105 మండలాలను మధ్యస్థ కరువు కేటగిరీలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు మించి తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం కరువు మండలాల (Mandals) సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్రంలోని 544 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి, జాతీయ విపత్తుగా (National Disaster) ప్రకటించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర కరువు మాన్యువల్‌-2016లో(Central Drought Manual-2016) మార్పులు చేయాలని కోరుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే వర్షాభావ పరిస్థితులపై హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోనే పరిస్థితి తీవ్రతకు ఉదాహరణలు కనిపిస్తున్నాయని విపక్షాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో 31 గ్రామీణ మండలాలకు 28 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా తీవ్ర కరువు జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువు కేటగిరీలోనే ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం కూడా తీవ్ర కరువు జాబితాలోకి రావడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోందని విమర్శకులు పేర్కొంటున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు ప్రాంతాలతో పాటు గుంటూరు, బాపట్ల, ఎన్‌టీఆర్‌, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని పశ్చిమ మండలాలు, డెల్టా చివరి భూముల్లోనూ పంటలు (Crops) ఎండిపోయాయని విపక్షాలు చెబుతున్నాయి. అనేక ప్రాంతాల్లో సాగు (Cultivation) చేయలేక భూములు ఖాళీగా ఉండిపోయాయని, రైతులు పెట్టుబడులు (Farmers Investments కోల్పోయారని, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొంటున్నాయి. తాగునీటి కొరతతో పాటు పశువులకు మేత దొరకని పరిస్థితులు కూడా నెలకొన్నాయని ఆరోపిస్తున్నాయి.

ఇంతటి కరువు పరిస్థితుల మధ్య కేవలం 388 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల మిగిలిన ప్రభావిత ప్రాంతాల రైతులు, కూలీలు, గ్రామీణ పేదలకు ప్రభుత్వ సహాయం అందకుండా పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరువు ప్రభావిత మండలాల సంఖ్యను పునఃసమీక్షించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా మరిన్ని మండలాలను జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment