---Advertisement---

డీఎస్సీ స్కామ్‌ బట్టబయలు? జిల్లాల వారీగా వెలుగులోకి వస్తున్న సంచలన అక్రమాలు?

September 5, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ–2025 నియామకాల్లో (DSC–2025 Recruitments) అక్రమాలు జరగలేదని కూటమి ప్రభుత్వం(Coalition Government) చెబుతున్నప్పటికీ, రోజుకో జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఆరోపణలు అనుమానాలకు తావిస్తున్నాయి. శ్రీకాకుళంలో స్పోర్ట్స్‌ కోటా(Sports Quota) సర్టిఫికెట్‌ మార్పులు, విశాఖలో నకిలీ బ్లైండ్‌ సర్టిఫికెట్‌ (Fake Blind Certificate) ఆరోపణలు, కోనసీమలో అర్హత లేని అభ్యర్థికి పోస్టింగ్‌, వైఎస్సార్‌ కడప జిల్లాలో రిజర్వేషన్‌ మార్పుల ఆరోపణలు, కర్నూలులో స్పోర్ట్స్‌ కోటా నియామకంపై వివాదం—డీఎస్సీ నియామక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

కోనసీమలో బీఈడీ సర్టిఫికెట్లు (B.Ed Certificates) సమర్పించలేదని వెరిఫికేషన్‌లో నమోదైనా ఉద్యోగం ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో బీసీ–ఈ(BC-E) అభ్యర్థి ఓసీ(OC) (ఈడబ్ల్యూఎస్‌) కింద ఉద్యోగం పొందిన వ్యవహారంపై కూడా వివాదం కొనసాగుతోంది. కర్నూలు ఘటనపై విద్యాశాఖ విచారణ ప్రారంభించినప్పటికీ, డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకమని శాఖ ప్రకటించడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ(YSRCP) డిమాండ్‌ చేస్తోంది. గురుపూజోత్సవం సందర్భంగా ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, అనర్హులను గుర్తించి తొలగించాలని, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.

డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) రాజీనామా(Resignation) చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) తదితరులు డీఎస్సీ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పూర్తిస్థాయి వెరిఫికేషన్‌ జరిగితే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment