---Advertisement---

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో స్కాం గుట్టు రట్టు .. టెట్‌ అర్హత లేకుండానే టీచర్ పోస్టు ఎలా వచ్చింది?

September 3, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ–2025(DSC–2025) నియామకాల్లో స్పోర్ట్స్ కోటా(Sports Quota) వ్యవహారంపై నెలలుగా ప్రతిపక్షాలు, అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలకు తాజాగా కర్నూలు (Kurnool) ఘటన మరింత బలం చేకూర్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలులో టెట్‌ (Kurnool TET) అర్హత లేకుండానే ఎస్జీటీ పోస్టుకు (SGT Post) ఎంపిక జరిగిందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. వల్లూరు ఘటనపై డీఈవో విచారణ చేపట్టగా, సంబంధిత అభ్యర్థి తనకు టెట్‌ అర్హత లేదని అంగీకరించినట్లు సమాచారం. దీంతో అర్హత లేని అభ్యర్థికి టీచర్‌ పోస్టు ఎలా దక్కిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డీఎస్సీలో అక్రమాల బండారం బయటపడుతోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాలు, పేపర్‌ లీక్‌ (Paper Leak) ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కర్నూలుకు చెందిన ప్రభాకర్‌ గౌడ్‌కు(Prabhakar Goud) టెట్‌ అర్హత లేకుండానే టీచర్‌ పోస్టు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

డీఎస్సీ అంశంపై చర్చకు రావాలని సవాల్‌ చేయడం కాదని, దమ్ముంటే ఇప్పుడు ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వరుదు కళ్యాణి అన్నారు. వైఎస్సార్‌సీపీ(YSRCP) మొదటి నుంచి చెబుతున్న ఆరోపణలు నిజమవుతున్నాయని, డీఎస్సీలో ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో పూర్తిస్థాయిలో తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) వెంటనే రాజీనామా(Resignation) చేయాలని వరుదు కళ్యాణి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment