---Advertisement---

డీఎస్సీ నియామకాల్లో ఆరోపణలపై దర్యాప్తుకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్.

September 30, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ(Teacher Recruitment Process), ముఖ్యంగా మెగా డీఎస్సీ-2025లో(Mega DSC-2025) చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) (CJP) ఏపీ విభాగం డిమాండ్ చేసింది. అమరావతిలో(Amaravati) నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీజేపీ నాయకుడు చేతన్ ప్రమోద్ (Chetan Pramod) ఈ డిమాండ్‌ను వెల్లడించారు.

రాష్ట్రంలో సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు, కొంతమంది ఉద్యోగ అభ్యర్థులు పలు సందేహాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారని. ముఖ్యంగా టెట్ అర్హత నిబంధనలు(TET Eligibility Rules), స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల చెల్లుబాటు(Sports Quota Certificates Validity), అభ్యర్థుల వివరాల పరిశీలన, పరీక్ష నిర్వహణ, ఎంపిక విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కొందరు డీఎస్సీ అభ్యర్థులు తమను సంప్రదించారని చేతన్ ప్రమోద్ తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే సమస్యకు రాజకీయ రంగు పులిమి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయని సీజేపీ పేర్కొంది.ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు నిష్పాక్షికమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని చేతన్ ప్రమోద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జెన్-జీ యువతలో(Gen-Z Youth) నిరుద్యోగిత రేటు సుమారు 4 శాతంగా ఉందనే గణాంకాలను కూడా ప్రమోద్ ప్రస్తావించారు.

కాగా, డీఎస్సీ నియామకాల్లో ఆరోపణలపై స్వతంత్ర లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు(Abdul Nazeer) వినతిపత్రం సమర్పించారు.

మరోవైపు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియామకానికి సంబంధించిన చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చేతన్ ప్రమోద్, ఆ చట్టం లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment