---Advertisement---

ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై జగన్‌కు గ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల విజ్ఞప్తి

September 17, 2026

Summarize with AI

---Advertisement---

గ్రూప్‌–1(Group–1), గ్రూప్‌–2 (Group–2) ఉద్యోగాలకు అభ్యర్థుల (Candidates) వయోపరిమితి (Age Limit)ని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని(YS Jagan Mohan Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర (A. Ravichandra) ఆధ్వర్యంలో అభ్యర్థులు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

ప్రభుత్వం ప్రకటించిన ఫేజ్‌–2 జాబ్‌ క్యాలెండర్‌లో(Job Calendar) వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు దూరమవుతున్నాయని వారు తెలిపారు. 2018 నుంచి 2026 మధ్య గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎస్సీ నోటిఫికేషన్లు (DSC Notifications) పరిమితంగా రావడంతో తాము వయోపరిమితి దాటిపోయామని వివరించారు. ప్రస్తుత జాబ్‌ క్యాలెండర్‌కు వన్‌టైమ్‌ సడలింపుగా వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌ను కోరారు.

తెలంగాణలో(Telangana) గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపులను కూడా వారు ప్రస్తావించారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచిన సమయంలో నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని టీడీపీ నేతలు, టీడీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు (TDP Graduate MLCs) డిమాండ్‌ చేసిన విషయాన్ని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

సెప్టెంబర్‌ 15న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వినతిపై జగన్‌ స్పందిస్తూ సమస్యను పరిశీలించి, అవసరమైన విధంగా ప్రస్తావిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment