---Advertisement---

ఏపీ ఎంపీల ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో ఎవరు టాప్?

August 31, 2026

Summarize with AI

---Advertisement---

స్థానిక అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజలకు ఉపయోగపడే శాశ్వత సామాజిక ఆస్తుల నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీ ల్యాడ్స్‌ పథకాన్ని (MPLADS – Members of Parliament Local Area Development Scheme) 1993 డిసెంబర్‌ 23న అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు(P.V. Narasimha Rao) ప్రారంభించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. ఈ పథకం కింద ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అవసరమైన అభివృద్ధి పనులను సిఫార్సు చేయవచ్చు.

ఈ నేపథ్యంలో తాజాగా ఎంపవర్డ్ ఇండియన్(Empowered Indian) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంలో వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీ మేడా రఘునాథరెడ్డి (Meda Raghunath Reddy) అగ్రస్థానంలో నిలిచారు.

తనకు కేటాయించిన నిధుల్లో ఏకంగా 55.17 శాతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించిన మేడా రఘునాథరెడ్డి, ఏపీ ఎంపీలలో మొదటి స్థానాన్ని సాధించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం రూ.14.70 కోట్ల నియోజకవర్గ నిధుల కేటాయింపులో రూ.8.10 కోట్లను ఖర్చు చేశారు. మొత్తం 139 ప్రాజెక్టులకు సిఫార్సు చేయగా, వాటిలో 110 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 29 పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఈ జాబితాలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి (Dr. Gumma Thanuja Rani) నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె తనకు కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు 48.94 శాతం వినియోగించారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి (Gurumurthy) 35.71 శాతం ఎంపీ ల్యాడ్స్‌ నిధులను ఖర్చు చేసి ఏడో స్థానంలో నిలిచారు.

అయితే ఈ నివేదికలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Bhupathiraju Srinivasa Varma) అట్టడుగు స్థానంలో నిలవడం. ఆయనకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని నివేదిక వెల్లడించింది. అలాగే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు (Lavu Srikrishna Devarayalu) పనితీరు కూడా నిధుల వినియోగంలో అట్టడుగు స్థాయిలోనే ఉన్నట్లు పేర్కొంది.

ప్రజాప్రతినిధుల పనితీరును కేవలం రాజకీయ ప్రసంగాలతో కాకుండా, వారికి కేటాయించిన అభివృద్ధి నిధులను ఎంత సమర్థవంతంగా వినియోగించారనే అంశంతోనూ అంచనా వేయాల్సిన అవసరం ఉందనే చర్చకు ఈ ఎంపవర్డ్ ఇండియన్ నివేదిక తెరలేపుతోంది. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులను అధికంగా వినియోగిస్తూ మేడా రఘునాథరెడ్డి (Meda Raghunath Reddy) అగ్రస్థానంలో నిలవగా, మరోవైపు కేంద్ర సహాయ మంత్రి స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి ఖాతాలో సున్నా ఖర్చు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment