---Advertisement---

పోలీస్‌ ఉద్యోగాల కోసం అభ్యర్థుల ఆందోళన.. కాకినాడలో కలెక్టర్‌కు వినతి

September 7, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడలో అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పోలీస్‌ శాఖలో సుమారు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీసం 10 వేల పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని వారు కోరారు. 2022 తర్వాత పోలీస్‌ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో ఏళ్లుగా సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే డిమాండ్లపై ఏపీ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు గత ఆగస్టు 7న తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని, పోలీస్‌ ఉద్యోగాల భర్తీతో పాటు వయోపరిమితి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జగన్‌ హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న కొద్దీ నిరుద్యోగులకు నష్టం జరుగుతోందని, ఒకవైపు ఉద్యోగ అవకాశాలు దూరమవుతుండగా మరోవైపు పోలీస్‌ శాఖలో సిబ్బంది కొరత కొనసాగుతోందని అభ్యర్థులు పేర్కొన్నారు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment