---Advertisement---

ఏపీ సోషల్ మీడియాలో వరుస ఆంక్షలు.. ప్రతిపక్షం నుంచి పౌర సంఘాల దాకా ఇదే పరిస్థితి!

September 20, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సోషల్ మీడియా(Social Media) ఖాతాలు(Accounts), పోస్టులపై(Posts) విధించిన ఆంక్షలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై పరిమితులు విధించడంపై ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న డిజిటల్ వేదికలను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) విమర్శించారు.

ఇదే సమయంలో జర్నలిస్టుల (Journalists) సోషల్ మీడియా పోస్టులపైనా ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ‘ది న్యూస్ మినిట్’(The News Minute) ఎడిటర్-ఇన్-చీఫ్ ధన్యా రాజేంద్రన్ (Dhanya Rajendran) తన ఎక్స్ ఖాతాలోని పోస్టులకు సంబంధించి ఏపీ పోలీసులు ‘ఎఫ్‌బీఐ’(FBI) పేరుతో టేక్‌డౌన్ అభ్యర్థనలు పంపారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ (PV Ramesh) సహా పలువురు స్పందించారు. అలాగే బిగ్ టీవీ యాంకర్ సోషల్ మీడియా ఖాతాలపై జరిగిన చర్యలను కూడా ఆమె ప్రశ్నించారు.

మానవ హక్కుల సంస్థలు, పౌర సంఘాల సోషల్ మీడియా కంటెంట్‌పైనా పరిమితులు విధించారనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖపట్నం పరిసరాల్లో డేటా సెంటర్ల నిర్మాణం, భూవినియోగం, నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, పర్యావరణ ప్రభావాలపై ప్రశ్నలు లేవనెత్తిన ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’ (Stop Vizag Data Centres) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా భారత్‌లో అందుబాటులో లేకుండా పోయిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై మాజీ కేంద్ర కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ (E.A.S. Sarma) స్పందిస్తూ, ఖాతా బ్లాకింగ్‌పై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకుంటే అది భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య చర్చపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఖాతాల నుంచి జర్నలిస్టులు, మానవ హక్కుల సంస్థలు, పౌర ఉద్యమాల డిజిటల్ వేదికల వరకు వరుసగా ఆంక్షలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఏపీ రాజకీయ, పౌర వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య పారదర్శకతను ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోందని పౌర సమాజం భావిస్తోంది. కూటమి ప్రభుత్వం (Coalition Government) తక్షణమే ఇలాంటి నిరంకుశ చర్యలను విడనాడి, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన సాగించాలని, లేని పక్షంలో పౌరులు ఉద్యమించి నిరంకుశ పరిపాలనను అంతమొందించే అవకాశమూ లేకపోలేదని ప్రజాస్వామ్యవాదులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment