కొరియా మాస్టర్స్ 2026లో(Korea Masters 2026) భారత బ్యాడ్మింటన్‌కు(Indian Badminton) అద్భుత విజయం దక్కింది. అస్సాంకు(Assam) చెందిన అష్మిత చాలిహా(Ashmita Chaliha) మహిళల సింగిల్స్ టైటిల్‌ను(Women’s Singles Title) సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన నాలుగో సీడ్ హాన్ కియాన్ షీపై(Han Qian Xi) 14-21, 21-14, 21-14తో విజయం సాధించింది. ఆగస్టు 9న దక్షిణ కొరియాలోని ఆసాన్‌లో జరిగిన ఈ మ్యాచ్ 53 నిమిషాల పాటు సాగింది. ఈ విజయంతో అష్మిత కెరీర్‌లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను(BWF World Tour Title) గెలుచుకుంది.
తొలి గేమ్‌లో వెనుకబడిన అష్మిత ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ర్యాలీలపై పట్టు సాధించి 21-14తో గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 21-14తో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
క్వార్టర్ ఫైనల్లో సంచలన విజయం
టైటిల్ ప్రయాణంలో అష్మితకు గట్టి పోటీ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ జపాన్ క్రీడాకారిణి హినా అకేచీని 20-22, 21-15, 21-19తో ఓడించింది. తొలి గేమ్‌ను కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని సెమీఫైనల్‌కు చేరుకుంది.
సెమీఫైనల్లో మరో భారత షట్లర్ రక్షిత రామ్‌రాజ్‌ను 21-13, 16-21, 21-13తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
గాయం నుంచి తిరిగి వచ్చి టైటిల్
కుడి మోకాలి గాయం(Right Knee Injury) కారణంగా దాదాపు 3 నెలలు కోర్టుకు దూరంగా ఉన్న అష్మిత.. పునరాగమనం చేసిన కొద్ది కాలానికే సూపర్ 300 టైటిల్‌ను సాధించింది. ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్, ఫైనల్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినా మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకోవడం ఆమె పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది.
అష్మిత చాలిహా తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మరో శుభపరిణామంగా నిలిచింది. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై ఆమెపై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి.








