ఆసియా క్రీడలు (Asian Games) 2026 మహిళల క్రికెట్లో(Women’s Cricket) భారత్(India) ఫైనల్‌కు(Final) చేరుకుంది. బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన 2వ సెమీఫైనల్లో టీమిండియా (Team India) 114 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది.
భారత్(India) తరఫున షఫాలీ వర్మ (Shafali Verma) అద్భుత శతకంతో చెలరేగింది. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఆమె 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. స్మృతి మంధాన 37, హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) 40 పరుగులతో రాణించారు.
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. దిలారా అక్తర్ (Dilara Akter) 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో నందని శర్మ, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీయగా.. శ్రీ చరణి 2 వికెట్లు పడగొట్టింది.
మరో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక (Sri Lanka) ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ స్వర్ణ పతకం కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.







