---Advertisement---

షూటింగ్‌లో అదరగొట్టిన నీరు ధండా.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

September 29, 2026

Summarize with AI

---Advertisement---

ఏషియన్ గేమ్స్ (Asian Games) 2026లో భారత్ (India) మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల ట్రాప్ షూటింగ్‌లో (Women’s Trap Shooting) భారత షూటర్ నీరు ధండా (Neeru Dhanda) అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని (Gold Medal) సొంతం చేసుకుంది. ఈ విజయంతో వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది.

వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్ ఫైనల్‌లో 8 మంది షూటర్లు పోటీపడ్డారు. ఇందులో నీరు ధండా 28 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గత ఏషియన్ గేమ్స్‌లో నమోదైన 24 పాయింట్ల రికార్డును కూడా ఆమె బద్దలు కొట్టింది.

చైనా షూటర్ యునాంగ్ సన్ 26 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకోగా.. 28 పాయింట్లతో నీరు ధండా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఏషియన్ గేమ్స్ ప్రారంభమై 11 రోజులు పూర్తయ్యాయి. మంగళవారం సర్ఫింగ్, ఆర్చరీ, కురాష్, ట్రాక్ సైక్లింగ్, షూటింగ్, స్క్వాష్, కానో స్లాలోమ్, సెయిలింగ్, టెన్నిస్, బాక్సింగ్ తదితర క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

సోమవారం జరిగిన వివిధ పోటీల్లో భారత్‌కు మొత్తం 8 పతకాలు లభించాయి. ఇందులో 4 రజతాలు(4 Silver Medals), 4 కాంస్య పతకాలు (4 Bronze Medals) ఉన్నాయి. అయితే స్వర్ణ పతకం మాత్రం దక్కలేదు. తాజాగా నీరు ధండా సాధించిన పసిడి పతకంతో భారత్ మరోసారి స్వర్ణ ఖాతా తెరిచింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment