తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’(Bigg Boss) మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ భారీ రియాల్టీ షో ఇప్పుడు 10వ సీజన్‌తో (10th Season) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిర్వాహకులు విడుదల చేసిన స్పెషల్ వీడియోతో బిగ్‌బాస్ 10పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈసారి కూడా షోకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. “ఎన్నో యుద్ధాలు (Wars) గెలుచుకున్న రాజ్యం (Kingdom) మాత్రమే కాదు.. ఎంతోమంది హృదయాలు (Hearts) గెలుచుకున్న మహా సామ్రాజ్యం”(Great Empire) అంటూ నాగార్జున చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. బిగ్‌బాస్‌పై రూపొందించిన ప్రత్యేక గీతం, విజువల్స్‌తో వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు.
“చెదరని ప్రస్థానం.. తరగని అభిమానం బిగ్‌బాస్ సొంతం. ఈ ప్రయాణం ఇప్పుడు ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈసారి మీరు చూడబోయేది బిగ్‌బాస్ దశావతారం (Bigg Boss Dashavataram)” అంటూ నాగార్జున చెప్పిన మాటలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేశాయి.
ప్రతి సీజన్‌కు ప్రత్యేక క్యాప్షన్‌తో వచ్చే బిగ్‌బాస్.. ఈసారి “ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్స్ వివరాలను మాత్రం నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈసారి హౌస్‌లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారన్న దానిపై సోషల్‌మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.






