---Advertisement---

‘పెద్ది’ లో అభ్యంతరకర సీన్స్ తొలగింపు: క్షమాపణలు కోరుతూ బుచ్చిబాబు ట్వీట్ వైరల్

June 6, 2026

Summarize with AI

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’(Peddi) సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కించిన ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు చేశారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదాల నడుమ దర్శకుడు బుచ్చిబాబు సనా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ (Emotional Note) విడుదల చేశారు. ఒక చిత్ర దర్శకుడిగా తాను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా, వారితో భావోద్వేగంగా కలిసిపోవాలని భావిస్తానని చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో తాను ఎప్పుడూ సినిమాలు తీయనని స్పష్టం చేశారు.

‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన విమర్శలను పూర్తిగా విన్నానని, వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నానని బుచ్చిబాబు తెలిపారు. వ్యక్తిగతంగా తనకు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందని, ఏ మహిళా పాత్రను వస్తువుగా చూపించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ సినిమాలోని ఏదైనా భాగం ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించి ఉంటే, వారి భావాలను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.

ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసినట్లయితే అందుకు హృదయపూర్వక క్షమాపణలు (Heartfelt Apology) కోరుతున్నానని బుచ్చిబాబు వెల్లడించారు. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల సున్నితమైన అభిప్రాయాలను గౌరవించడం కథకుల బాధ్యత అని అంగీకరించారు. ముఖ్యంగా మహిళా పాత్రల ప్రదర్శన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని వివాదాస్పదంగా మారిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలని, భవిష్యత్తులో మహిళలను మరింత శక్తివంతంగా చూపించే కథలను తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

తన తప్పును నిర్మొహమాటంగా ఎత్తిచూపి నిజాయితీగా అభిప్రాయాలు తెలిపిన ప్రతి ఒక్కరికీ బుచ్చిబాబు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన విమర్శలను స్వీకరించి వెంటనే స్పందించడం, ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవించడం పట్ల నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment