---Advertisement---

వైసీపీ అధికారంలోకి రాగానే తొలి విచారణ డీఎస్సీపైనే – బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి

September 21, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ శాప్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నియామకాలపై తొలి విచారణ చేపడతామని ప్రకటించారు. అనవసరమైన అంశాలపై సీఐడీ, సిట్ విచారణలకు ఆదేశాలు ఇస్తున్న ప్రభుత్వం.. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

దాదాపు 100 మందికి ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కల్పించారని ఆరోపించిన ఆయన.. కోకో, సాఫ్ట్‌బాల్, జూడో తదితర క్రీడల్లో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకున్నామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.

డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్‌పై కూడా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ నిరసన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని, రేపు కూడా ఉద్యమం చేపడతామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment