---Advertisement---

Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి..రక్తసిక్తమైన ముఖంతో వీడియో వైరల్!

May 22, 2026

Summarize with AI

---Advertisement---

ఫ్రాన్స్‌లో (France) జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మిస్ వెనిజులా 2025గా (Miss Venezuela 2025) గుర్తింపు పొందిన 29 ఏళ్ల ఆండ్రియా డెల్ వాల్‌పై (Andrea Del Valle) ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్ని లగూనా(Giovanni Laguna) దాడి చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆండ్రియా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

వీడియోలో ఆండ్రియా ముఖం మొత్తం రక్తంతో(Blood) కనిపించగా, ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “చూడండి.. జియోవన్ని లగూనా నాకు ఇదే చేశాడు. నువ్వు నిజంగా ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది” అంటూ స్పానిష్‌లో మాట్లాడింది. అనంతరం హోటల్ గదిలో జరిగిన విధ్వంసాన్ని కూడా వీడియోలో చూపించింది. గది మొత్తం చిందరవందరగా మారి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటన మంగళవారం ఫ్రాన్స్‌లోని కేన్స్(Cannes) నగరంలోని ఓ హోటల్ గదిలో జరిగినట్లు సమాచారం. హోటల్‌లో పెద్ద ఎత్తున అరుపులు, గొడవ శబ్దాలు వినిపించడంతో అక్కడి అతిథులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి జియోవన్ని లగూనా గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం తరలించినట్లు సమాచారం.

జియోవన్ని లగూనా లాటిన్ అమెరికాలో(Latin America) ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా(Celebrity Stylist) గుర్తింపు పొందాడు. 2023 నుంచి మిస్ యూనివర్స్ కొలంబియా క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. పలువురు బ్యూటీ క్వీన్స్, సెలబ్రిటీలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.

దాడి అనంతరం ఆండ్రియా డెల్ వాల్‌కు వైద్య చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ గొడవకు అసలు కారణమేంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఫ్రెంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment