---Advertisement---

సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదల..

May 13, 2026

---Advertisement---

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా నమోదైనట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 17,80,365 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 17,68,968 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 15,07,109 మంది విద్యార్థులు విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ శాతం గణనీయంగా తగ్గడం గమనార్హంగా మారింది.

2025లో మొత్తం 14,96,307 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వగా, అప్పటి మొత్తం పాస్ శాతం 88.39గా నమోదైంది. ప్రస్తుతం విడుదలైన 2026 ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 3.19 పాయింట్లు తగ్గడంతో విద్యార్థులు, విద్యాసంస్థల్లో చర్చనీయాంశంగా మారింది.

సీబీఎస్‌ఈ బోర్డు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్, ఉమంగ్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను పరిశీలించవచ్చని సూచించింది. మార్కుల మెమోల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సంబంధిత పాఠశాలలను సంప్రదించాలని బోర్డు పేర్కొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment