---Advertisement---

ఉద్యోగులకు హామీలు ఎక్కడ? చంద్రబాబు సర్కారుపై కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం

September 6, 2026

Summarize with AI

---Advertisement---

చంద్రబాబు (Chandrababu) కూటమి ప్రభుత్వం (Coalition Government) రెండున్నరేళ్లు పూర్తయినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను (Promises) అమలు చేయకుండా మోసం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌(AP Government Employees Federation) రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి (Kakarlа Venkatramireddy) ఆరోపించారు. ముఖ్యమంత్రి చర్చలకు పిలిచినా చివరకు రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్‌ లీవు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా రెండే ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

పీఆర్సీ కమిషన్‌(PRC Commission), ఐఆర్‌(IR), సీపీఎస్‌ రద్దు (CPS Abolition) హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల వివరాలు ఆర్థిక శాఖ వద్దే లేవంటున్నారని, మరి బకాయిలు చెల్లించామని ఎలా చెబుతున్నారని నిలదీశారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో 27 శాతం ఐఆర్‌, జీతాల పెంపు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం వంటి చర్యలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఆర్‌, పీఆర్సీ, పింఛన్‌ స్కీమ్‌పై స్పష్టత లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భజన చేస్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు.

టెట్‌(TET), డీఎస్సీ (DSC) అంశాల్లోనూ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చే వరకు ఉద్యోగులకు ప్రభుత్వం చేసేదేమీ ఉండదని కాకర్ల వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment