---Advertisement---

Chiranjeevi: ’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’… ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్

June 4, 2026

Summarize with AI

---Advertisement---

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’(Peddi) జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ జాతర సృష్టిస్తోంది. తొలి షో నుంచే సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద సంబరాల్లో మునిగిపోయారు. ఈ అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తన మనసంతా ‘పెద్ది’ విజయోత్సాహంలోనే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా కోసం గత 2 సంవత్సరాలుగా రామ్ చరణ్ చేసిన కష్టం, అంకితభావం, పట్టుదలను తాను దగ్గరుండి చూసినట్లు వెల్లడించారు. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనమై చరణ్ చేసిన కృషి ప్రతి సన్నివేశంలో కనిపిస్తోందని కొనియాడారు.

“చరణ్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న అపారమైన ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా(Father) మాత్రమే కాదు.. ఒక నటుడిగా(Actor) కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది” అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి.

ఈ సందర్భంగా చిత్ర బృందంపై కూడా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటనను అభినందించడంతో పాటు కీలక పాత్రల్లో నటించిన శివరాజ్‌కుమార్(Shiva Rajkumar, జగపతిబాబులను (Jagapathi Babu) ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అద్భుతమైన కథను రాసి దాన్ని అదే స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

‘పెద్ది’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మెగా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉండగా.. చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియానే కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment