---Advertisement---

ఏపీలో విషాదం! క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థుల మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

September 2, 2026

Summarize with AI

---Advertisement---

పోలవరం జిల్లా (Polavaram District) ఎటపాక మండలం (Etapaka Mandal) గొల్లగుప్ప గ్రామంలోని (Gollaguppa Village) పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పాఠశాల సిబ్బంది 73 మంది విద్యార్థులకు (73 Students) క్లోరోక్విన్ మాత్రలు (Chloroquine Tablets) పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అస్వస్థతకు గురైన విద్యార్థులను తెలంగాణలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి (Bhadrachalam Area Government Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు పంపిణీ చేసిన మందులు గడువు ముగిసినవేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి, మందుల పంపిణీకి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment