తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) విజయ్ను (Vijay) సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రత్యేకంగా కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ (Kamal Haasan) స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞాపకంగా కొన్ని ప్రత్యేక పుస్తకాలను విజయ్‌కు బహుమతిగా అందజేశారు.
తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన అనేక ఆలోచనలను విజయ్ ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారని కమల్‌హాసన్ తెలిపారు. సమావేశ సమయంలో విజయ్ చూపించిన ఆత్మీయత, ప్రేమ తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న తమిళ చిత్ర పరిశ్రమకు (Tamil Film Industry) ప్రభుత్వం నుంచి మరింత మద్దతు, ప్రోత్సాహం అందించాలని 6 కీలక అభ్యర్థనలు చేసినట్లు వెల్లడించారు. ఈ చర్చలు రాష్ట్ర అభివృద్ధికి(State Development), సినీ పరిశ్రమ (Film Industry) భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫ్లోర్ టెస్ట్‌లో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడంతో ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ (M. K. Stalin)ను కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు కమల్‌హాసన్ భేటీతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன்.
— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026
தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது.
பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY






