---Advertisement---

దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలు!

September 18, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana పార్టీ ఫిరాయింపుల (Party Defections) వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే (Khairatabad MLA) దానం నాగేందర్‌కు (Danam Nagender) సంబంధించిన కేసులో హైకోర్టు (High Court) కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో(Congress) చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.

దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించే తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ స్పీకర్ ఆ పిటిషన్లను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి(Kaushik Reddy), మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌లో చేరడం, అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లుగా పరిగణించాలని పిటిషనర్లు వాదించారు.

అయితే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు వార్తా కథనాలు, ఫొటోలు మాత్రమే పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించేందుకు సరిపోవని వాదించారు. అసెంబ్లీ రికార్డుల్లో ఆయన పేరు బీఆర్ఎస్(BRS) సభ్యుడిగానే కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారంపై 2025 జూలై 31న సుప్రీంకోర్టు స్పీకర్‌ను నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

తాజాగా స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టడంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ తీర్పు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment