---Advertisement---

ఏపీలో కలవరపెట్టిన మరో దారుణం…4 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం!

February 22, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో (Devarapalli Mandal) అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారిపై (Four-Year-Old Girl) 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను గోపాలపురం (Gopalapuram) మండలం గోపవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనుల నిమిత్తం ఇటీవల దేవరపల్లి ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment